Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిసెంబర్‌ 8, 9 తేదీలలో గ్లోబల్‌ సమ్మిట్‌

డిసెంబర్‌ 8, 9 తేదీలలో గ్లోబల్‌ సమ్మిట్‌

- Advertisement -

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
నవతెలంగాణ-కందుకూరు

డిసెంబర్‌ 8, 9 తేదీలలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రజా ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తామ న్నారు.. 2047 వరకు తెలంగాణ ఏరకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి అనే విషయాలను ప్రజా ప్రభుత్వం వివరిస్తుందన్నారు. భారత్‌ ఫీచర్‌ సిటీ, హైటెక్స్‌, గచ్చిబౌలి, దుండిగల్‌ తదితర ప్రాంతాలను వేదికల కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు.

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల ఓపెన్‌ ల్యాండ్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల దుబారు ఫెస్టివల్‌ నిర్వాహనకు ఒక కొత్త నగరాన్ని దుబారు బయట ప్రాంతంలో ఎంపిక చేసి నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతం. అద్భుతమైన వాతావరణం, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయని, గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా తరలివస్తున్న పారిశ్రామికవేత్తలకు వివరించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, వికాస్‌రాజ్‌, శశాంక, నర్సింహారెడ్డి, కృష్ణభాస్కర్‌, ముషారఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -