నవతెలంగాణ – కాటారం
కర్ణాటక రాష్ట్రంలోని తూమకూరు జిల్లాలో జరిగే జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కాటారం గిరిజన గురుకుల విద్యార్థి బి అజయ్ ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుండి 30 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 7నుండి 9 వరకు మహబూబ్నగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి U-17 హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ లో వరంగల్ జట్టు తరుపున అజయ్ అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి వరంగల్ జిల్లా గోల్డ్ మెడల్ సాధించాడు.
అజయ్ ఎంపిక కావడం పట్ల భూపాలపల్లి జిల్లా ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి, జైపాల్ పేట సంఘం ప్రెసిడెంట్ శిరంగి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. రమేష్ తోపాటు కలశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ మూల వెంకటేష్, ఉపాధ్యాయులు, తదితరులు కూడా సంతోషం వక్తం చేశారు.



