నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గ గ్రామం శివారు ప్రాంతం పరిధి పరిధిలోని సన్‌షైన్ పాఠశాలను ఖండేబల్లూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లాలయ్య ఆకస్మికంగా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అవసరమైన పత్రాలను పరిశీలించి, విద్యార్థుల విద్యా పునాది బలపరిచేందుకు విలువైన సూచనలు అందించారు. ప్రయివేట్ పాఠశాలల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలు పర్యావరణంలో భాగంగా పచ్చని చెట్లు నాటాలని పాఠశాల ఇచ్చిన సూచించారు. విద్యార్థులకు ఆడుకునేందుకు ఆట స్థలం బాగుందని నిత్యం పిల్లలకు ఆరోగ్యంలో భాగంగా నిర్వహించాలని అన్నారు. పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు మరుగుదొడ్లు ప్రతి ఒక్క నిత్యవసర వస్తువులు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని సమకూర్చాలని సూచించారు. పాఠశాల పరిసరాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ” అనంతరం పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ మరియు ప్రిన్సిపల్ అశోక్ లాలయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకాంత్, రవి, సుజాత, జనాభాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేట్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కాంప్లెక్స్ హెచ్ ఎమ్.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


