Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీఎస్టీపై అవగాహన అవసరం..

జీఎస్టీపై అవగాహన అవసరం..

- Advertisement -

ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ ప్రాక్టీషనర్, ప్రోపరేటర్ వంగ విష్ణు ప్రకాష్ 
నవతెలంగాణ – ఆర్మూర్ 

జీఎస్టీ అనే అతిపెద్ద టాక్స్ రిఫామ్ అమలైన తర్వాత కాలం నుండి వ్యాపారస్తులకు (ప్రతి ఒక్కరికి) చాలా రకమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయని పట్టణానికి చెందిన విష్ణు జిఎస్టి ఇన్కమ్ టాక్స్ ప్రాక్టీషనర్, ప్రోపరేటర్ వంగ విష్ణు ప్రకాష్ సోమవారం తెలిపారు. రిటర్న్ దాఖలు ఇలా చేయాలి రిటర్న్ దాఖలు ఎన్ని రకాలుగా ఉంటాయి. బిల్స్ ఏ విధంగా మెయింటెన్ చెయ్యాలి.. నోటీసులు ఎందుకు వస్తాయి.. వస్తే ఏ విధంగా స్పందించాలి..ఇలా చాలా రకాల సందేహాలు వస్తాయని అన్నారు. వ్యాపార సంస్థ యొక్క టర్నోవర్ గమనించి 20 లక్షల పైబడి ఉన్నవాళ్లు జీఎస్టీ రికగ్నిషన్ తీసుకోవాలని తర్వాత అదే జిఎస్టి నెంబర్ పై కొనుగోలు అమ్మకాలు నిర్వహించాలని అన్నారు. అమ్మకాలు చేసేటప్పుడు (బి టు బి, ) (బీటు సి) అనేది గమనించి దాని ప్రకారంగా బిల్స్ మెయింటెన్ చేయాలని తెలిపారు.

రిటర్న్ దాఖలు సాధారణంగా రెండు రకాలు ఉంటుందని, జిఎస్టిఆర్ ఒకటి అమ్మకాల యొక్క వివరాలు, జిఎస్టిఆర్ మూడు బి కొనుగోలు అమ్మకాల సారాంశం అని వీటిలో ఏ తప్పు జరిగిన నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందని దీనిని గమనించాలని అన్నారు. ప్రతి వ్యక్తి వారి వార్షిక ఆదాయం మూడు లక్షల పైబడి ఉన్నవారు తప్పకుండా ఆదాయ పన్ను దాఖలు చేయాలని తెలిపారు. ఉదాహరణకు సాలరీ, రెంటల్ ఇన్ కం, బిజినెస్, క్యాపిటల్ గే న్ ఇలా దేని ద్వారా అయినా వార్షిక ఆదాయం మూడు లక్షలు, ఆ పైబడి ఉన్నవారు తప్పకుండా రిటర్న్ దాఖలు చేయాలని, లేనిచో డిపార్ట్మెంట్ నుండి నోటీసులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

కొందరు ఆదాయం మూడు లక్షల పైబడి ఉండిన కూడా టాక్స్ కటు అవ్వలేదు అని రిటర్న్ దాఖలు చేయరు. కానీ టాక్స్ కట్టు అవ్వకపోయినా కూడా వీరు రిటర్న్ దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా నోటీసుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చని తెలిపారు. బ్యాంకు ద్వారా వచ్చిన వడ్డీ పై టీడీఎస్ కట్టు ఆయనచో దానిని రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆధార్, పాన్ కార్డ్ లింకు చేసుకొని వారు వచ్చేనెల డిసెంబర్ 31వ తేదీ లోపు లింకు చేసుకోవాలని, ఆధార్ పాన్ లింక్ లేనిచో ఎటువంటి రిటర్న్ దాఖలు చేయడం సాధ్యపడదని తెలిపారు.

సద్వినియోగం చేసుకోండి: వంగ విష్ణు ప్రకాష్, విష్ణు జిఎస్టి, ఆర్మూర్
జీఎస్టీ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తమ కార్యాలయానికి వచ్చేవారికి పూర్తి వివరణతో తెలుపుతున్నాము. వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -