Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని ఐఎఫ్టియు  జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని కోరారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం  ధర్నా నిర్వహించి ఎంపీడీవో కు వినతి పత్రాన్ని అందజేశారు. దాసు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికుల సమస్యల పరిష్కరించాలని, పీఎఫ్ ఈఎస్ఐ చట్టాల అమలు చేయాలని, కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాద బీమా 30 లక్షల కట్టాలని, జీవో నెంబర్ 51 మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అక్రమ తొలగింపులు ఆపాలని, ఆన్లైన్లో ఎక్కనీ వారి పేర్లను ఎంట్రీ చేయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దేవన్న గ్రామపంచాయతీ నాయకులు షాపూర్ పోశెట్టి, భాస్కర్, ముత్యం ,లింగన్న రసూల్, సావిత్రి చిన్నయ్య, ఆశీర్వాదం , రషీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -