Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

- Advertisement -

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు 
శ్రీరామగిరి పిఎసిఎస్ చైర్మన్ గుండా వెంకన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 

దళారుల చేతిలో మోసపోవద్దు అనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు శ్రీ రామగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుండా వెంకన్న తెలిపారు. సోమవారం వావిలాల ఆలేరు నరసింహుల గూడెం శ్రీరామగిరి మదనతుర్తి రావిరాల గ్రామాలలో డైరెక్టర్లతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. కేంద్రాలలో ఇన్చార్జీలు రైతులను ఎవరిని కూడా ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకన్న, డైరెక్టర్లు తండా నరసయ్య, మద్దెల సమ్మయ్య, బెల్లి నరసయ్య, గోపగాని శేఖర్ ,సిబ్బంది రంజిత్, ఆయా సెంటర్ల ఇన్చార్జులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -