Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారం లేకపోయినా పేదలకు అండగా కమ్యూనిస్టు పార్టీ

అధికారం లేకపోయినా పేదలకు అండగా కమ్యూనిస్టు పార్టీ

- Advertisement -

సీపిఐ ఎమ్మెల్సీ నెల్లికాటి సత్యం
నవతెలంగాణ – తిమ్మాజిపేట

అధికారం లేకపోయినా పేదవారికి ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టు పార్టీ అండగా నిలుస్తుందని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికాటి సత్యం అన్నారు. సిపిఐ శతవసంతాల సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న జరగనున్న వందేళ్ల ముగింపు సభ విజయవంతం చేయాలని కోరుతూ శనివారం గద్వాల్ నుండి ప్రారంభమైన సిపిఐ బస్సు జాత సోమవారం తిమ్మాజిపేట మండల కేంద్రానికి చేరుకుంది ఈ బస్సు జాతకు సిపిఐ, ఏఐటియుసి కార్మిక నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేశారు. అనంతరం సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికాటి సత్యం మాట్లాడుతూ  కమ్యూనిస్టు పార్టీ అంటేనే కష్టజీవుల పేద వర్గాల పార్టీ అని అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో సామాజిక న్యాయం కోసం చైతన్యపరిచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తుందని అన్నారు 10 సంవత్సరాల కాలంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ రంగం సంక్షోభంలో కోరుకు  పోయింది.

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ దేశ సంపదను కొద్దిమంది చేతులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, తెలంగాణకు నల్ల బంగారం లాంటి సింగరేణి రైల్వే విమానయాన సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. భారతదేశం ప్రజాస్వాంమీక దేశం భారత దేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు, బౌద్ధులు సకల జనులు ఉన్నటువంటి భారతదేశాన్ని మతాల మధ్య చిచ్చు పెడుతున్న దుర్మార్గమైన ప్రభుత్వమని విమర్శించారు. నియంతృతమైన ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఆటుపోట్లు ఎదురైనా ఈ సమాజ మార్పు కోసం నిలబడి ప్రయాణం కొనసాగిస్తుందన్నారు. రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో నిలబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం బాలనరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫయాజ్ సిపిఐ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి కే బాలకిషన్  ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ సిపిఐ జిల్లా నాయకులు ఎండి కాజా మొయినుద్దీన్  కే రాము, ఈర్ల చంద్రమౌళి, కృష్ణాజి ఈర్ల భూపేష్, ఏఐటియుసి నాయకులు జీవన్, మధు,  కృష్ణ, ఆంజనేయులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -