Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదించాలి

బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదించాలి

- Advertisement -

జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

బీసీ 42 శాతం రిజర్వేషన్ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ బిల్లు 42 శాతం రిజర్వేషన్ కు అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ, విద్య,రిజర్వేషన్ కు  అసెంబ్లీలో ఆమోదించాయి కానీ హైకోర్టు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదన్నారు. బిసి జేఏసీ చైర్మన్,ఎంపి ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ సంఘాలు అక్టోబర్ 18న బిసి బందుకు  సంపూర్ణ మద్దతు అన్నిరాజకీయ పార్టీలు ప్రకటించాయన్నారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటు సమావేశంలో బిల్లు ఆమోదించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.లేకుంటే బిసి ద్రోహులుగా మిగులుతారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -