Monday, November 17, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజా కళలను రక్షించుకోవాలి..

ప్రజా కళలను రక్షించుకోవాలి..

- Advertisement -

పిఎన్ఏం డివిజన్ మహాసభలో జూలకంటి
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ప్రజా కళలను రక్షించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం స్థానిక పిఎన్ఎం కార్యాలయంలో మిర్యాలగూడ డివిజన్ మహాసభ నిర్వహించారు. అంతకు ముందు పిఎన్ఏం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కళారూపాలు అంతరించిపోతున్నాయని వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కళాకారులను ఆదుకోవాలని కోరారు. కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్న పెన్షన్ వెంటనే విడుదల చేయాలని గుర్తింపు కార్డులు ఇచ్చి బస్సు పాసులు అందించాలని కోరారు. ప్రజల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టేందుకు కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్య తీసుకురావాలని సూచించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు డిసెంబర్ 6, 7 తేదీలలో మడుగులు పల్లి లో నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ తెలిపారు. ఈ మహాసభలో జిల్లాలో ప్రజానాట్యమండలి బలోపేతం కోసం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 15 మందితో నూతన డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పల్ల ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్,ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేమిడాల పరుశురాములు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పుట్టల సైదులు, నాయకులు కుమ్మరి సైదులు, రమణ, అక్కినేపల్లి సైదులు, ఊర్మిళ, భూపతి శైలజ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -