Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహకార సంఘాల ద్వారా రైతులు అభివృద్ధి చెందాలి

సహకార సంఘాల ద్వారా రైతులు అభివృద్ధి చెందాలి

- Advertisement -

రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ ప్రిన్సిపల్ వెంకన్న
నవతెలంగాణ – భిక్కనూర్
సహకార సంఘాల ద్వారా రైతులు అభివృద్ధి చెందాలని రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ ప్రిన్సిపల్ వెంకన్న తెలిపారు. సోమవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల భాగంగా సొసైటీ కార్యాలయ ఆవరణలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు, రుణాలు అందజేస్తుందని, రైతులు పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ధర తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, క్లస్టర్ ఆఫీసర్ రమేష్, మానిటరింగ్ అధికారి సురేష్, కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రాజిరెడ్డి, సీఈవో మోహన్, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -