అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ, ‘ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారగా దర్శకుడు సాయిలు ఈ సినిమాకు స్క్రిప్ట్ చేశాడు.
వినగానే నన్ను కలచివేసింది. పరువు హత్యల గురించి మనం విన్నాం, ఇంకొన్ని విధాలుగా పరువు హత్య ఘటనలు జరగడం చూశాం. కానీ ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదు అనిపించింది. ఇది వాస్తవ ఘటన నేపథ్యంగా సాగే సినిమా అయినా దర్శకుడు మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ ఉండేలా చేశాడు. ‘బేబీ’, ‘7/జి బృందావన కాలనీ’, ‘సైరత్’, ‘ప్రేమిస్తే’ చిత్రాల్లో ఈ సినిమా గుర్తుంటుంది’ అని తెలిపారు. ‘ఓ ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ ఘటన 15 ఏళ్లుగా అక్కడే సమాధి చేయబడింది. ఈ ఘటన గురించి తెలుసుకుని, ఆ నేపథ్యంతోనే మంచి డ్రామా యాడ్ చేసి, థియేట్రికల్‌గా చూసేలా సినిమాను మా దర్శకుడు సాయిలు అద్భుతంగా తీశాడు’ అని నిర్మాత రాహుల్ మోపిదేవి చెప్పారు.
ఆ.. సినిమాల్లా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



