లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో రవింద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వం వహించారు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. శివాజీ మాట్లాడుతూ, ‘మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా దర్శకుడు అద్భుతమైన కథ రాసుకున్నారు. ప్రతీ ఒక్కరి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఇది మంచి బిర్యానీలాంటి చిత్రం. నా క్యారెక్టర్‌లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం రాబోతోంది. ఇది వంద శాతం కమర్షియల్ చిత్రం’ అని తెలిపారు. ‘చావు, కులం అనే పాయింట్‌లతో ఎంటర్టైనింగ్‌గా ఎన్నో మంచి విషయాల్ని ఈ సినిమాలో చెప్పారు. ఓ మీనింగ్ ఫుల్ సినిమాను తీశామని మాత్రం చెప్పగలను’ అని నవదీప్ చెప్పారు.
‘టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుంది’ అని నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ, ‘ఈ టీజర్ చూసి అల్లు అర్జున్ అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్. ఈ కథను విన్న వెంటనే సపోర్ట్ చేసిన బెన్నీకి థ్యాంక్స్. ఇది చాలా మంచి చిత్రం. ఇందులో అందరూ ఎనర్జిటిక్‌గా నటించారు. వాళ్ల నటనతో ఈ చిత్రం నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇలాంటి సందేశాన్ని ఇంత ఎంటర్టైనింగ్‌గా చెప్పారా? అని మూవీని చూసిన తరువాత ఆడియెన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
100% కమర్షియల్ చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



