Tuesday, November 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమమ్దానీతో భేటీ అవుతా : ట్రంప్‌

మమ్దానీతో భేటీ అవుతా : ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : న్యూయార్క్‌ నగర మేయర్‌గా ఎన్నికైన మమ్దానీతో సమా వేశమవుతానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. పరస్పరం అభిప్రాయాలు పంచు కుంటామని, పలు అంశాలపై చర్చించుకుంటామని చెప్పారు. న్యూయార్క్‌ కోసం అంతా మంచే జరిగేలా తాము ప్రయతిస్తామని అన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో కూడా చర్చలకు సిద్ధమేనని ట్రంప్‌ ఇప్పటికే చెప్పారు. ‘నేను ఎవరితో అయినా మాట్లాడతా’ అని వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్‌-మమ్దానీ సమావేశం ఎప్పుడు జరిగేదీ ఇంకా ఖరారు కాలేదని శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ అన్నారు.

న్యూయార్క్‌పై తగ్గని కోపం
మమ్దానీ విజయం తర్వాత న్యూయార్క్‌ నగరానికి ప్రభుత్వం కేటాయించే నిధులపై ట్రంప్‌ సహాయకులు సమీక్ష జరుపుతున్నారు. ఏయే కార్యక్రమాలను పక్కన పెట్టాలి లేదా రద్దు చేయాలి అనే విషయంపై కసరత్తు జరుగుతోంది. మమ్దానీని మేయర్‌గా ఎన్నుకున్న న్యూయార్క్‌ నగరంపై ట్రంప్‌ ఇంకా కోపంతోనే ఉన్నారనడానికి ఇది సంకేతంగా కన్పిస్తోంది. నిధుల నిలిపివేతకు సంబంధించి ట్రంప్‌ ఇచ్చే ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. శ్వేతసౌధం, మమ్దానీ తాత్కాలిక బృందం మధ్య ఇప్పటి వరకూ ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. న్యూయార్క్‌ నగరం 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ నిధులను అందుకుంది. ఇది దాని బడ్జెట్‌లో 8.3 శాతానికి సమానం. విద్య, గృహనిర్మాణం, సామాజిక సేవలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు ఇతర రకాల సాయం వంటి వాటి కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -