- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఉద్దేశించిన బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, కనీస వేతనాలకు భరోసా లభించనుంది. వారి సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రత్యేక బోర్డు, నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది గిగ్ కార్మికులు రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి ఉద్యోగ భద్రత, చెల్లింపుల్లో పారదర్శకత కొరవడింది.
- Advertisement -



