చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. సాధారణంగా జలుబు, తలనొప్పి, తల తిమ్మిర్లు, న్యుమోనియా, చర్మం పొడిబారడం, ఫ్లూ వంటి సమస్యలు ఎదురయ్యేందుకు ఆస్కారం ఉంది. ముందుగా వింటర్‌లో వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.
జలుబు, దగ్గు.. : వింటర్‌లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు కోల్డ్, తలనొప్పి. ముందుగా జలుబు చేసి తరువాత తలనొప్పి, గొంతునొప్పికి కూడా దారితీస్తుంది. మ్యూకస్ పోగై ముక్కు బ్లాక్ అవుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల ముందుజాగ్రత్తగా వింటర్‌లో మీ చెవులకు, ముక్కుకు చల్లగాలి సోకకుండా తగిన వస్త్రధారణ ఉండాలి. అలాగే వేడి నీటితో స్టీమ్ చేయడం, వేడి నీటిని పుక్కిలించడం వంటివి చేయాలి. చలిలో బయటకు వెళ్లాల్సి వస్తే చలి గాలి తాకకుండా చెవులు, ముక్కు కవర్ చేసుకోవడం మరవొద్దు.
చర్మం పొడిబారడం.. : వింటర్ మొదలైందంటే చాలు చర్మం పొడిబారడం మొదలవుతుంది. పెదాలు కూడా పగులుతుంటాయి. వింటర్‌లో సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్యే ఇది. ఈ సమయంలో చలిని తట్టుకునేందుకు బాగా వేడి నీటితో స్నానం చేస్తుంటారు కొందరు. కానీ ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఇలా చేస్తే దురద పుడుతుంది. అందువల్ల బాగా వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. మీ స్కిన్ పొడిబారకుండా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
ఫ్లూ జ్వరం : చలికాలంలో ఎక్కువ మంది ఫ్లూ జ్వరం బారిన పడుతుంటారు. బ్యాక్టీరియా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే తరచుగా చేతులు శుభ్రపరుచుకోవాలి. చెవులకు చలి గాలి సోకకుండా చూసుకోవాలి. అలాగే అరికాళ్లు చలి బారిన పడకుండా సాక్స్ ధరించాలి.
న్యుమోనియా : న్యుమోనియాలో ముందుగా కనిపించే లక్షణాలు జలుబు, దగ్గు. ఆ తరువాత క్రమంగా ఇన్ఫెక్షన్ పెరిగితే దగ్గు, ఆయాసం తీవ్రమవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినందున శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది. యాంటీబయోటిక్స్‌తో కొందరికి ఇంటి వద్దే నయమై ౖపోయినా మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స అవస రం అవుతుంది. తీవ్రతను బట్టి వైద్యుల సలహా తీసుకోవాలి.
వింటర్‌లో హెల్దీగా…
- Advertisement -
- Advertisement -



