లక్ష్యం 472, ప్రస్తుతం 169/7
జమ్మూ : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో హైదరాబాద్ ఓటమి కోరల్లో కూరుకుంది. తొలి నాలుగు మ్యాచుల్లో ఓ విజయం, మూడు డ్రాలతో సరిపెట్టిన హైదరాబాద్.. జమ్మూ కశ్మీర్ చేతిలో భారీ ఓటమి లాంఛనం చేసుకుంది. 472 పరుగుల రికార్డు ఛేదనలో హైదరాబాద్ ప్రస్తుతం 169/7తో పోరాడుతుంది. తన్మరు అగర్వాల్ (47, 81 బంతుల్లో 7 ఫోర్లు), అభిరథ్ రెడ్డి (18), రాహుల్ సింగ్ (30, 40 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్స్), కొడిమెల హిమతేజ (12), నితీశ్ రెడ్డి (0), రాహుల్ రాదేశ్ (20), తనరు త్యాగరాజన్ (0) నిరాశపరిచారు. అనికెత్ రెడ్డి (35 నాటౌట్, 51 బంతుల్లో 5 ఫోర్లు), రక్షణ్ రెడ్డి (0 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. అబ్దుల్ సమద్ (125, 200 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు), కన్హయ్య (95, 110 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), కమ్రాన్ ఇక్బాల్ (50), వివ్రాంత్ శర్మ (45) రాణించటంతో జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 100.5 ఓవర్లలో 422 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ జమ్మూ కశ్మీర్ 170 పరుగులు చేయగా.. హైదరాబాద్ 121 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్, జమ్మూ కశ్మీర్ రంజీ మ్యాచ్‌లో నేడు ఆఖరు రోజు. జమ్మూ కశ్మీర్ విజయానికి 3 వికెట్ల దూరంలో ఉండగా.. హైదరాబాద్ మరో 303 పరుగులు చేయాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ బౌలర్లు అబిద్ ముస్తాక్ (4/56), సాహిల్ లోత్రా (2/28), అకిబ్ నబి (1/15) రాణించారు.
ఓటమి ముంగిట హైదరాబాద్
- Advertisement -
- Advertisement -



