వెనిజులాపై సైనిక చర్యను తోసిపుచ్చని అమెరికా
వాషింగ్టన్/కారకాస్ : ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమేనని అమెరికా, వెనిజులా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, నికొలస్ మదురో ప్రకటించారు. మదురోతో సమా వేశమయ్యేందుకు సుముఖంగానే ఉన్నానని ట్రంప్ సోమవారం తెలిపారు. అయితే వెనిజులాపై సైనిక చర్య జరిపే అవకాశాలను ఆయన తోసిపుచ్చలేదు. ‘నేను దానిని కాదనలేను. నేను దేనినీ తోసిపుచ్చను’ అని ఆయన చెప్పారు. వెనిజులా నుంచి అమెరికాకు రవాణా అవుతున్న మాదక ద్రవ్యాలు, వలసదారుల వెనుక మదురో ఉన్నారంటూ పాత పాట ఎత్తుకున్నారు. అమెరికాకు మదురో అపార నష్టం కలిగించారని ఆరోపించారు. ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
చర్చలకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే మదురో సానుకూలంగా స్పందించారు. తానూ చర్చలకు సంసిద్ధమేనని చెప్పారు. వెనిజులాతో చర్చించాలని భావించే ఎవరైనా ముఖాముఖి మాట్లాడవచ్చునని, ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. చర్చలు, శాంతి తనకు సమ్మతమేనని, యుద్ధానికి వ్యతిరేకినని తెలిపారు.
చర్చలకు ట్రంప్, మదురో సంసిద్ధత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



