Wednesday, November 19, 2025
E-PAPER
Homeబీజినెస్200 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

200 శాతం పెరిగిన బంగారం దిగుమతులు

- Advertisement -

పడిపోయిన రత్నాలు, అభరణాల ఎగుమతులు
ముంబయి :
ధర పెరిగినప్పటికీ బంగారం దిగుమతుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో పసిడి దిగుమతులు ఏకంగా 199.2 శాతం ఎగిసి రూ.1400 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో కేవలం రూ. 500కోట్ల మేర దిగుమతులు జరిగాయి. పండగ సీజన్‌ కావడంతో పసిడి దిగుమతులు పెరిగాయని పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో 26.51 బిలియన్‌ డాలర్ల విలువ చేసే బంగారం దిగుమతి నమోదయ్యిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు తెలిపాయి. గతేడాది ఇదే సమయంలో రూ.209 కోట్ల మేర దిగుమతులు చోటు చేసుకున్నాయి. గడిచిన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలంలో దేశంలోకి ఏకంగా 299.77 టన్నుల బంగారం దిగుమతైంది. కాగా.. గతేడాది ఇదే సమయంలో 401.27 టన్నులుగా ఉంది.

అభరణాల ఎగుమతుల్లో 31 శాతం పతనం
అమెరికా టారిఫ్‌లతో రత్నాలు, అభరణాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 31 శాతం పతనమై రూ.200 కోట్లకు పరిమితమయ్యాయని జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో రూ.వంద కోట్లకుపైగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో వీటి ఎగుమతులు 3 శాతం తగ్గి రూ. 160 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 3.2 శాతం పెరిగి రూ. 110 కోట్లుగా నమోదైంది. గడిచిన అక్టోబర్‌లో డైమాండ్స్‌ ఎగుమతులు 27 శాతం క్షీణించి రూ.వందకోట్లకు చేరాయి. భారత పసిడి అభరణాల ఎగుమతులు 28 శాతం పతనమై రూ.8500 కోట్లుగా నమోదయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -