– గూగుల్ చీఫ్ సుందర్ పిచారు
వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఎఐ) విస్పోటనం చెందితే దాని ప్రభావం అన్ని కంపెనీలపై పడుతుందని గూగుల్ సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న ఎఐ బూమ్‌లో హేతుబద్దత లేదని.. అయిన ప్పటికీ రంగంలో పెట్టుబడులు పెరుగుతు న్నాయన్నారు. వాస్తవానికి ఎ కంపెనీ కూడా ఎఐ ప్రభావానికి లోనుకాకుండా ఉండలేదన్నారు. ఆ జాబితాలో తాము కూడా ఉంటామన్నారు. ఎఐ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని పిచారు సూచించారు. ఎఐ మోడల్స్ లోనూ పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చేందుకు చాలా వర్క్ చేస్తున్నామన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఏఐ విధానాలతో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయ న్నారు. గూగుల్ ఎఐ తాజా మోడల్ జెమిని 3.0 కోసం టెకీ ప్రపంచం ఎదురు చూస్తోం దన్నారు. ఎఐ సెక్యూర్టీ గురించి కూడా పెట్టుబడి పెంచినట్లు పిచాయ్ తెలిపారు. ఏదైనా ఇమేజ్ ఏఐ ద్వారా వచ్చిందా లేదా అని తెలుసు కోవడానికి ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఎఐతో అన్ని కంపెనీలపై ప్రభావం
- Advertisement -
- Advertisement -


