- Advertisement -
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ : ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించడం లేదనడానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్న కాళీ కుర్చీల చిత్రం. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది సమయానికి రాకపోవడం పరిపాటిగా మారింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఫీల్డ్ లో ఉన్నామనే షాకు ని సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పేరుతో సొంత పనులు చేసుకుంటున్నారని విమర్శలు సైతం వెలువడుతున్నాయి. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉండే షాద్నగర్ ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది సమయపాలన నిర్లక్ష్యం వైఖరి తీరును మార్చుకోవాలని కోరుతున్నారు.
- Advertisement -


