Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఇందిరా గాంధీ జయంతి..

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో వారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, ముబారక్, మాధవులు మాట్లాడుతూ.. పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఆమె దేశానికి చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బెన్నీ రాఘవేందర్, రహమాన్, సంతోష్, శేఖర్ శివ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -