- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని గోరిట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోరిట ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దామోదర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 2025 – వానాకాలం ఎ గ్రేడ్ రకానికి రూ. 2389 సాధారణ రకానికి రూ 2369. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ రూ. 500 ఇవ్వడం జరుగుతుందని పిఎసిఎస్ సీఈవో శ్రీను తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్లు సీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



