Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ అవగాహణ కార్యక్రమాలు 
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యాక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషన రేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేయడానికి రూపోందించినది. అరైవ్ అలైవ్  డిఫెన్సివ్ డ్రైవింగ్  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య తెలియజేశారు.

ఈ రోడ్ సేఫ్టీ ప్రచారంలో దీని ముఖ్య ఉద్దేశ్యాలు….
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సేఫ్ డ్రైవింగ్ అలవర్చడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించడం, హెల్మేటు  సీటు బెల్టు వాడకం పెంపు, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ వాడకం గురించి హెచ్చరికలు, పాదాచారుల భద్రత మొదలగునవి తెలియజేయడం జరుగుతుంది. ఈ అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్  అలైవ్  డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమాలు ఇక మీదట అన్ని స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులలో పనిచేసే వారికి, గ్రామాలలో, రహదారికి ఇరువైపుల గల ప్రధాన జంక్షన్లలో మొదలగు ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -