Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుల దురహంకార హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేవీపీఎస్

కుల దురహంకార హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేవీపీఎస్

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో కెవిపిఎస్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల క్రిందట రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామం నివాసి అయిన దళిత ఎర్రశేఖర్ బీసీ కులానికి చెందిన భవాని అనే అమ్మాయిని ప్రేమించి చట్టబద్ధంగా ఆదర్శ వివాహం చేసుకున్నాడు. అయితే దళిత ఎర్ర శేఖర్ ను ఆయన ఇంటి దగ్గర అర్థరాత్రి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేయడం జరిగింది. ఇది క్రూరమైన చర్యని ఇటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ మండల కార్యదర్శి ఆర్ విజయ్ కుమార్ అన్నారు.

హత్య కావించబడిన వ్యక్తి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఈ సందర్బంగా నాయకులు డిమాండ్ చేశారు. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మూడెకరాల భూమి ఇవ్వాలని అన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 142 కుల దురహంకార హత్యలు జరిగాయని, దీనిపై చర్చించి కులాంతర వివాహాల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని అన్నారు. రాజశేఖర్ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని అన్నారు. హత్య చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో కులాంతర హత్యలు జరగకుండా ప్రభుత్వమే చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఆనంద్ బాబు రవి సౌలు రాజు దస్తగిరి దుబ్బన్న సిఐటియు నాయకులు లక్ష్మన్న తిప్పారెడ్డి రైతులు బెంజమిన్ నాగేష్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -