Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకోడప్ గాల్ 
భారత మాజీ మహిళా ప్రధాని, భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారంమండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని అన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు నేటి తరం నాయకులకు, యువతకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు.

బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందిరా గాంధీ భారత స్త్రీ శక్తికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు. అవకాశాలు వస్తే అద్భుతాలు చేయగలం అంటూ నిరూపించారనిప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు,మోహన్, బస్వరాజ్ దేశాయ్, సంతోష్ దేశాయ్, మల్లప్పపటేల్, మొగ్లగౌడ్, పండరి, నాగరాజు, అంజయ్య, బాలరాజు, కృష్ణమూర్తి, ఫెరోజ్, ఇస్మాయిల్, హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -