Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను  కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహా మనిషి ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. దేశంలోని పేదలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని, ఇందిర గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పాటుపడిన అలసట తెలియని స్త్రీ శక్తి, గరీబి హటావో అనే నినాదంతో పేదలకు భూములు పంచిన ధీరావనిత, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ  అని కొనియాడారు.

ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, పూజారి శేఖర్, దూలూరి కిషన్ గౌడ్, మారుపాక నరేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -