– జిల్లా కేంద్రంలో రెండు నెలలుగా కొనసాగుతున్న డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్
– సంబంధం లేని సమాధానాలు చెప్తున్న సిబ్బంది
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా గత రెండు నెలలుగా రామారెడ్డి రోడ్డులో ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్ కొనసాగుతుంది. ఈ విషయం తెలిసిన కొందరు విలేకరులు వెళ్లి ఆ సెంటర్లో ఉన్న సిబ్బందిని ఎక్కడినుండి పర్మిషన్ తీసుకున్నారు.
ఎలా కొనసాగుతుందని ప్రశ్నించగా సంబంధం లేని సమాధానాలు చెప్తూ విషయాన్ని దాటవశారు. డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామని ఒకరు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసుకున్నామని, మరొకరు సంబంధం లేని విషయాలు చెప్పడంతో డిఎంహెచ్ఓ కార్యాలయం, సోషల్ వెల్ఫేర్, డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో అధికారులను అడగగా అలాంటిది తమ దృష్టికి ఏమి రాలేదని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో అడగగా అందుకోసం 10 స్వచ్ఛంద సంస్థల నుండి దరఖాస్తులు వచ్చాయని వాటిని ఇంకా పరిశీలించలేదని, త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్య తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



