నవతెలంగాణ – కామారెడ్డి
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో సామాజిక న్యాయ సాధనలో, పేదల సంక్షేమంలో ఇందిరాగాంధీ పాత్ర అపారమని గుర్తుచేశారు.
ఆమె పాలనలో చూపిన ధైర్యం, దూరదృష్టి, నాయకత్వం నేటికీ దేశానికి ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంపరిలక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు కన్నయ్య, ప్రసన్న, చాట్ల రాజేశ్వర్, రాజు, లడ్డు, కాళ్ళ గణేష్, అన్వర్ బాయ్, తేజపు ప్రసాద్, కాళ్ళ గణేష్, నర్సింలు, ఆకుల రవి, రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గణేష్ నాయక్, దోమకొండ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారంగుల అశోక్ రెడ్డి, వైద్య కిషన్ రావు, రాజా గౌడ్, పిల్లి మల్లేష్, జమీల్, సిద్ధికి, యూనుస్, శంకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమ ప్రియ, లక్క పతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



