తెయూ లో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో 197వ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరతి పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు ఎంతటి బాధ్యతలనైనా భుజం మీద ఎత్తుకునే శక్తి కలవారని, ఇదే చారిత్రాత్మక సాక్ష్యం అన్నారు. యూనివర్సిటీ అధ్యక్షులు పృథ్వి మాట్లాడుతూ.. కేవలం యుద్ధమే చేయలేదని, యువతలో ధైర్యానికి పునాది వేసిందని, దేశం, ధర్మం, స్వాభిమానం కోసం ఏ పరిస్థితుల్లోనైనా నిలబడాలని, ఆమె ధైర్యం నిర్ణయం తపన ప్రతి భారతీయులకు ప్రేరణ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్, కార్యకర్తలు సంతోష్ రాహుల్, శివ, నెహ్రు విద్యార్థులు పాల్గొన్నారు.
రేపటి వీరనారులు మీరే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



