Wednesday, November 19, 2025
E-PAPER
Homeఖమ్మంరోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి

రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి

- Advertisement -

– ప్రయాణీకుల ప్రాణాలను కాపాడండి – బీఆర్ఎస్ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రభుత్వం తక్షణమే రోడ్ లకు మరమ్మత్తులు చేపట్టి,గుంతలను పూడ్చి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జుజ్జూరి వెంకన్న బాబు డిమాండ్ చేసారు. పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు,నియోజక వర్గం ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే  మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం బుధవారం “గుంతలను పూడ్చండి ప్రజల ప్రాణాల్ని కాపాడండి” అంటూ నినాదాలతో మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసారు. 

ముందుగా స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి బైక్ ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అనేక రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయని తక్షణమే గుంతలను పూడ్చాలని లేని పక్షంలో మరింత ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలను గాలికి వదిలేసారని పేర్కొన్నారు. 

అనంతరం సీపీఐ ఆద్వర్యం నిరసన దీక్ష చేపట్టిన నివాసాలు నేలమట్టం అయిన బాధితులకు సంఘీభావం ప్రకటించి పేదలు కు గృహాలు నిర్మించే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జే. శ్రీరామ్మూర్తి,రఘురాం,ఎస్ వీర్రాజు,ఎన్ వెంకన్న బాబు, ఎండి హుస్సేన్,ఎం.నవీన్ నాయక్,హెచ్.వంశీ నాయక్, తల్లాడి వెంకటేశ్వరరావు, గోవింద్, తాళం సూరిబాబు, ఎన్.రాంబాబు,సీహెచ్ బజారయ్య,పద్దం జోగారావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -