Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర

ముగిసిన కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర

- Advertisement -

దారి పొడవునా అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనం
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర బుధవారం చౌటుప్పల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. భూపాల్ రెడ్డి అంతిమయాత్ర ఉదయం ఇంటి వద్ద 10:15 నుంచి ప్రారంభమైంది. యాదాద్రిభువనగిరి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి ఎండి జాంగిర్ భూపాల్ రెడ్డి పాడేను మోసారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. శాంతినగర్ కాలనీ నుంచి భూపాల్ రెడ్డి అంతిమయాత్ర శాంతినగర్ మంచికంటి కాలనీ పైనుంచి పోలీస్ స్టేషన్ ప్రాంతం తంగడపల్లి సర్వీస్ రోడ్డు నుండి సీపీఐ(ఎం) కార్యాలయంకు మధ్యాహ్నం 12:30కు చేరుకున్నది.

పార్టీ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్, భూపాల్ రెడ్డి పార్ధీ దేహానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ ప్రాంతం మీదగా చిన్న కొండూరు రోడ్డు నుండి రామాలయంపై నుంచి బీసీ కాలనీ మీదుగా భూపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. భూపాల్ రెడ్డి అమార్ రహే అంటూ పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చారు. భూపాల్ రెడ్డి అంతిమయాత్రలో అశేష జనం భారీ ఎత్తున పాల్గొన్నారు. భూపాల్ రెడ్డి అమరహే అంటూ స్లోగన్లు ఇస్తూ ముందుకు సాగారు. కళాకారులు డప్పులతో బ్యాండ్లతో భూపాల్ రెడ్డి చేసిన పనులను పాటల రూపంలో ఆలపించారు. భూపాల్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన ప్రజలు భౌతికయానికి సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన చేసిన పనులు చౌటుప్పల్ ప్రాంతంలో ఎనలేని కృషి ఉన్నదని ప్రజలు తెలిపారు. భూపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద రెడ్ సెల్యూట్ భూపాల్ రెడ్డి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం భూపాల్ రెడ్డి కుమారుడు విప్లవ రెడ్డి 2:46 నిమిషాలకు చితికి నిప్పంటించారు. దీంతో ఆయన ఆయన అంతిమయాత్ర ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -