నవతెలంగాణ – మిర్యాలగూడ
వనదర్శిని కార్యక్రమంలో భాగంగా.. మిర్యాలగూడ అటవిశాఖ ఆధ్వర్యంలో ఆదిత్య పాఠశాల విద్యార్థులకు అడవుల పట్ల అవగాహనా సదస్సును నిర్వహించారు. అడవులు అంటే ఏమిటీ? ఎన్ని రకాలు, వాటి వలన ఉపయోగాలు ఏమిటి? మానవ జీవితంలో వృక్షాల ప్రాముఖ్యత ఎట్టిదో విద్యార్థులకు వివరించారు. అడవుల గురించి సమాచారం ను విద్యార్థుల నుండి ప్రశ్నలు అడిగి సేకరించారు.ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందచేసారు. ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండంట్ మారుతి అమరేందర్ రెడ్డీ మాట్లాడుతూ.. విద్యార్థుల కు ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవడంతో ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. భోదనా పద్దతి లో భాగంగా ప్రతి ఏడాది క్షేత్ర పర్యటనలను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం గౌతమ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వి.సంతోష్ కుమార్, బీట్ ఆఫీసర్స్ విక్రమ్, కవిత, ప్రీతీ, ముకేశ్, రవీందర్ పాల్గొన్నారు.
విద్యార్థులకు వనదర్శిని అడవులు – సంరక్షణపై అవగాహనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



