లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మెగా రెడ్డి
నవతెలంగాణ – పెబ్బేరు
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి, వైశాఖపూర్, రంగాపురం, జనంపల్లి, తోమాలపల్లి, సూగూరు, పెంచికలపాడు, బునియాదిపురం, గుమ్మడం గ్రామాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 48 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు, వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆరు లక్షల 96 వేల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాసులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్, యుగంధర్ రెడ్డి, రంజిత్ కుమార్, రామన్ గౌడ్, రాములుయాదవ్, లక్ష్మణ్ ,రాజేష్, శివకుమార్ రాములు తదితరులు పాల్గొన్నారు.



