నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు దేశ తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం కొయ్యుర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశ తొలి మహిళ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా,పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకురాలుగా.. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా భారత దేశ ప్రజలకు అనేక సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాపు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి లాకావత్ సవేందర్, వేమూనూరి ప్రభాకర్, గద్దె సమ్మి రెడ్డి, రామచంద్రు, రాజిరెడ్డి పాల్గొన్నారు.
కొయ్యుర్ లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



