నవతెలంగాణ – రామారెడ్డి
మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వెలిసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో అందజేశారు. ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ… భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పశుపతి, రవీందర్ గౌడ్, ల్యాగల ప్రసాద్, నామాల రవి, గణేష్, వెంకటస్వామి, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



