నవతెలంగాణ – చిన్నకోడూరు
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రమైన చిన్నకోడూరు లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వర్కర్స్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర యూత్ ఇంచార్జ్ ఆంకర్ మధు ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కనకరాజు మాట్లాడుతూ.. దేశం నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అంటే మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ పరిపాలన విధానం అన్నారు.
ప్రధానిగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షులు బత్తిని గణేష్, వర్కర్స్ కాంగ్రెస్ కమిటీ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు మిట్టపల్లి మహేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బంక చిరంజీవి, సేవాదళ్ బ్లాక్ అధ్యక్షుడు కోనేటి కర్ణాకర్, బాబు మియా జెరిపోతుల బాబు, కర్నె శ్రీనివాస్, గంట శ్రీను తదితరులు పాల్గొన్నారు.



