Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక..

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక..

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని సెరపెల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు చావన్ క్రాంతి కుమార్ తో పాటు దాదాపుగా 200మంది కి పైగా ముధోల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నారాయణ్ రావు పటేల్ ఆధ్వర్యంలో బుధువారం చేరారు. ఈ సందర్బంగా  కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను చూసి బీజేపీ, బిఆర్ ఎస్ పార్టీ నుంచి కుభీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్,పురం శెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో సెరపెల్లి గ్రామం నుంచి అధిక సంఖ్యలో భారీగా పలువురు చేరడం తో వారికి నారాయణ్ రావు పటేల్ పార్టీలోకి తీసుకోని కండువాలు కప్పారు. దింతో ఆయన మాట్లాడుతూ గ్రామమలో పేద ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు, అభివృద్ది పనులను అందించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలిపారు.

దింతో పాటు గ్రామమలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా పనులను పరిశీలించి తర్వాగా పూర్తి చేసి రెండో విడతలో మరి కొన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే,తనూర్, కుంటల  మాజీ ఎంపీపీ చంద్రకాంత్,భోజరం పటేల్,నర్సారెడ్డి నారాయణ, విలాస్,నారా పరశురాం సీనియర్ నాయకుడు బంక బాబు,జైవంత్ శివాజీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -