– అదనపు డీఆర్డీఓ ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధులు ఉపాద్యాయులు చెప్పినవి వింటూ ఎవరి భవిష్యత్తుకు వారే చక్కని మార్గాన్ని ఏర్పర్చుకోవాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి ఎన్.రవి అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. క్లీన్ స్కూల్ 5.0 కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బ్యుటీషియన్ ల్యామ్, గ్రంధాలయాలను పరిశీలించారు.మధ్యాహ్న భోజన వంటశాల ను పరిశీలించి వంట వారికి సూచనలు చేశారు. అనంతరం 9, 10 వ తరగతి విద్యార్ధుల సామర్ధ్యాలను పరిశీలించి విద్యార్ధులతో మాట్లాడారు.ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తుందని గైర్హాజరు కాకుండా ప్రతీరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు బోధించిన అంశాలను పాటించి ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలను వేసుకోవాలని అన్నారు. చక్కని ప్రతిభకనబర్చిన విద్యార్దిని కందుకూరి గీతికాంజళి బహుమతిని అందించారు.పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయని చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేసారని ప్రధానోపాధ్యాయులు కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, ఉపాధిహామీ పథక అధికారి రామచంద్రరావు, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



