Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

కాలువ మరమ్మతుల పనుల కోసం భూమి పూజ చేసిన  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం గౌరయిపల్లి గ్రామ చెరువు నుండి కాచారం గ్రామ చెరువుకు వెళ్లే కాల్వ మరమ్మతుల కోసం ఆయన భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ కాలువ మరమ్మతులు చేయడం ద్వారా కాచారం చెరువు తొందరగా నిండి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని,  అందుకుగాను ఈ కాలువ మరమ్మతులు చేయడం జరుగుతుందని  తెలిపారు. రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహకారంతో ఎనిమిది సబ్ స్టేషన్లు సాంక్షన్ అయినాయి అని అన్నారు. దూది వెంకటాపురంలో నాలుగు కోట్లతో పని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గం లో రైతులకు ఎక్కడ లో ఓల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని అన్నారు.

గొలుసు కట్టు చెరువుల కాలువల మర మత్తు కోసం ఎస్ డి ఫ్ నిధుల నుంచి, డిఎంఎఫ్ నిధుల నుంచి పనులు చేస్తున్నామని అన్నారు. గౌరయపల్లి చెరువు కాల్వ వద్ద డిపి కట్టడం ద్వారా గౌరయ పల్లి, సాదు వెల్లి, కాచారం, కంఠం గుడం చెరువు నిండుతున్నాయని అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి  సహకారంతో  గంధమల్ల ను సాధించుకున్నామని తెలిపారు. అతి తొందరగా గంధమల్ల ను నింపుకుందామని అన్నారు. ఆలేరు నియోజకవర్గం లో ప్రతి చెరువు నింపి, ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని విధాల అభివృద్ధిలో ఆలేరు నియోజకవర్గం ముందు వరసలో ఉండే విధంగా చేస్తానని అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సీనియర్ నాయకులు కళ్లెం జాంగిర్ గౌడ్,  మాజీ ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడ్ల రామ్ రెడ్డి, యాకూబ్, భరత్ గౌడ్, పన్నీర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -