Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాత్రికేయులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ 

పాత్రికేయులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ 

- Advertisement -

పస్రా ఎస్ ఐ అచ్చ కమలాకర్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

పాత్రికేయులకు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పి జిల్లా కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించదలసినారని, ఇందుకోసం మండలం నుండి ఒక టీంను ఎంపిక చేయనున్నట్లు పసర ఎస్ ఐ అచ్చా కమలాకర్ తెలిపారు. బుధవారం ఎస్ ఐ కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో పాత్రికేయులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ సందర్భంగా జిల్లా ఎస్పీ పరిధిలోని 10 మండలాల నుండి మండలానికి ఒక క్రికెట్ టీమ్ను ఎంపిక చేసి పంపనున్నట్లు తెలిపారు. 

మన మండలానికి  సంబంధించిన మీడియా ప్రతినిధులు ఎంతమంది ఉన్నారో వారు తమ తమ టీమ్ లను మాకు తెలియచేయగలరు. అట్టి టీముల మధ్య పోటీ నిర్వహించి గెలిచిన జట్టును మన మండల టీముగా పరిగణించడం జరుగుతుంది. కావున మీడియా మిత్రులు సహకరించి వారి వారి టీంలతో మమ్మల్ని సంప్రదించగలరనీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -