Thursday, November 20, 2025
E-PAPER
Homeసినిమా'కొదమసింహం' రీ-రిలీజ్‌కి రెడీ

‘కొదమసింహం’ రీ-రిలీజ్‌కి రెడీ

- Advertisement -

చిరంజీవి కెరీర్‌లో సక్సెస్‌, జోనర్‌ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా ‘కొదమసింహం’ సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990 ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్‌, 5.1 డిజిటల్‌ సౌండింగ్‌తో సరికొత్తగా రమా ఫిలింస్‌ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ- రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌ ప్రీమయర్‌ షో, ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌ మీట్‌లో స్పెషల్‌ వీడియో ద్వారా చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ,’ఈ సినిమాలో నా స్టిల్‌ చాలా పాపులర్‌. నాకు ఫేవరేట్‌ ఫొటో అది. నాకు నచ్చిందని ప్రొడ్యూసర్స్‌ ఆ స్టిల్‌ను ఫ్రేమ్‌ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. మా ఇంట్లో ఇప్పటికీ ఈ ఫొటో ఉంది. నాకు కౌబాయ్ మూవీస్‌ అంటే ఇష్టం. క్లింట్‌ ఈస్ట్‌ వుడ్‌, గ్రెగరీ పెక్‌, ఒమర్‌ షరీఫ్‌ వంటి స్టార్స్‌ చేసిన సినిమాలను ఇష్టంగా చూస్తుండేవాడిని.

నేను యాక్టర్‌ అయ్యాక అలాంటి కౌబాయ్ మూవీ వస్తుందని, నేను చేస్తానని ఊహించలేదు. అప్పటికి హీరో కృష్ణ చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్టై అన్ని రికార్డ్స్‌ బ్రేక్‌ చేసింది. అలాంటి సినిమా మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. రమా ఫిలింస్‌ నాగేశ్వరరావు కౌబాయ్ కథతో మీతో ఒక కొత్త తరహా మూవీ చేయాలని ఉందని డైరెక్టర్‌ మురళీ మోహన్‌ రావుతో కలిసి వచ్చి, నాకు కథ చెప్పారు. కథ బాగా నచ్చి, వెంటనే అంగీకారం తెలిపాను. నాకు ఇది ఫేవరేట్‌ మూవీ, అయితే నాకంటే రామ్‌ చరణ్‌కు ఈ సినిమా ఇంకా ఎక్కువ ఇష్టం’ అని తెలిపారు. ‘చిరంజీవి డేట్స్‌ ఇచ్చాక ఆయన ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్‌తో సినిమా నిర్మించాలని ప్లాన్‌ చేశాం. ఈ కథ ఆయనకు బాగా నచ్చి సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు రీ రిలీజ్‌ సందర్భంగా కూడా మాకు ఆయన సపోర్ట్‌ అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని నిర్మాత కైకాల నాగేశ్వరరావు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -