ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే
నిందితుల అరెస్ట్‌కు 24న నిరసన దీక్ష
ొ సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
ొ బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, న్యూ డెమోక్రసీ నేతలు హాజరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సామినేని రామారావు హత్యకేసులో విచారణ పక్కదోవ పట్టేలా సాగుతోందని, ఘటన జరిగి 20 రోజులైనా నిందితులను అరెస్టు చేయటంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 25వ తేదీన దీక్ష చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) మధిర డివిజన్ కమిటీ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌లో సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, న్యూ డెమోక్రసీ, వివిధ ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రామారావు హత్యపై దశలవారీ పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సమిష్టి ఉద్యమానికి పిలుపునిచ్చారు.
కుట్రపూరిత కోణంలో విచారణ : పోతినేని సుదర్శన్‌రావు
కుట్రపూరిత కోణంలో రామారావు హత్యకేసు విచారణ సాగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. హత్య జరిగిన అక్టోబర్ 31వ తేదీన రామారావు సతీమణి స్వరాజ్యం పలానా వారు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసినా హంతకులను, కుట్రపన్ని హత్య చేయించిన వారిని ఇంతవరకూ అరెస్టు చేయలేదని తెలిపారు. పోలీసు విచారణ హంతకులను, హత్యకు కుట్రదారులను పట్టుకునే పద్ధతిలో కాకుండా రామారావు కుటుంబంపైనో, ఆయన జీవితకాలం విశ్వసించిన పార్టీ పైనో నేరం మోపే పద్ధతిలో సాగుతోందన్నారు. నిందితులు అధికా ర పార్టీకి చెందిన వారు కావటంతో కేసు విచారణను పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని, ఈ నిరసనలకు కలిసి రావాల్సిందిగా ఆయా పార్టీల నేత లకు విజ్ఞప్తి చేశారు.
కిరాయి హత్యల సంస్కృతి ప్రమాదకరం: తాతా మధుసూదన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు
కిరాయి హత్యల సంస్కృతిని ఆదిలోనే తుంచకపోతే మిగతాపార్టీల నాయకులకూ ప్రమాదమని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆందోళన వ్యక్తం చేశారు. రామారావు హత్యను రాష్ట్ర సమస్యగా పరిగణించి తీవ్రంగా ఖండించాలని తెలిపారు. హత్య జరిగి 20 రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోగా.. పక్కదోవ పట్టేలా విచారణ సాగిస్తున్న పోలీసు అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మధిర, పాలేరు నియోజకవర్గంలో అక్రమ పద్ధతుల్లో కేసులు పెడుతున్నారని అన్నారు. ఈ కేసు విచారణలో జాప్యం ప్రభుత్వ, పోలీసు యంత్రాంగానికి సిగ్గుచేటన్నారు. రామారావు హత్యోదంతంపై చేసే ఎలాంటి కార్యక్రమాల కైనా బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటిం చారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ .. రామారావుదీ ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అన్నారు. మధిర నియోజకవర్గంలోనే మరో హత్యోదంతం గోవిందాపురం కేసు విచారణ ట్రయల్ రన్ జరుగుతుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తప్పించటాన్ని బట్టి అధికారపార్టీ కేసుల విచారణను ఏ రకంగా పక్కదోవ పట్టిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. జడ్పీ మాజీ చైర్మెన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ.. రాజకీయ హత్య కాదేమో..! అని ప్రజలను నమ్మించే ధోరణిలో కాంగ్రెస్ తీరు ఉందని ఆరోపించారు.
పక్కదారి పట్టేలా విచారణ దండి సురేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
రామారావు హత్యకేసు పక్కదారి పట్టేలా విచారణ సాగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆరోపిం చారు. కేసు విచారణలో పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం తీరు అనుమానించేలా ఉందన్నారు. సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారపార్టీ ఒత్తిడికి తలొగ్గి నిందితులను పట్టుకోవటంలో పోలీసులు ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సామినేనిది రాజకీయ హత్యకాకపోతే మరేంటనేది నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో సామినేని రామారావు కుమారుడు విజరు, టీడీపీ జిల్లా నాయకులు కేతినేని హరీశ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, యర్రా శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఎం.సుబ్బారావు, ఎన్డీ నేతలు పరకాల లక్ష్మి, ముత్యాలు, జాన్‌రెడ్డి, బచ్చలకూర ఝాన్సీ, కొల్లేటి నాగేశ్వరరావు, పీడీఎస్‌యూ నాయకులు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘సామినేని హత్య’పై దశలవారీ పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



