మంత్రి పొన్నంకు మీ సేవ ఎంప్లాయీస్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ మీ సేవ కేంద్రాల కనీస వేతనాలు పెంచాలని తెలంగాణ మీ సేవా ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు జే.వెంకటేష్, అధ్యక్షులు ఆర్.సురేష్ ఆధ్వర్యం లోని ప్రతినిధి బృందం బుధవారం మంత్రిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించింది. ”సర్కార్ కొత్తగా ప్రవేశ పెడుతున్న సేవల వల్ల మాకు పని భారం పెరుగుతున్నది. ప్రభుత్వ లక్ష్యాలకు అను గుణంగా రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాలు ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. అయినప్పటికి గత రెండేండ్లుగా మీ సేవ కేంద్రాల కనీస వేతనాలు పెంచలేదు. వార్షిక బోనస్ ఇన్సెంటీవ్ చెల్లించలేదు. పీఎప్ ఖాతాలను బ్రేక్ లేకుండా కొనసాగించడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం విధివిధానాలు రూపొందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి” అని లేఖలో పేర్కొన్నారు.
కనీస వేతనాలు పెంచండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



