నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని పెద్దతూండ్ల,శాత్రజ్ పెళ్లి గ్రామాల రెవెన్యూ శివారు భూముల్లో బొగ్గు నిక్షేపాల కోసం సింగరేణి ఆధ్వర్యంలో అన్వేషణ ప్రారంభమైంది. తాడిచెర్ల ఓసీ-2 ప్రాజెక్ట్ కోసం శాత్రాజ్ పల్లి, భూపాలపల్లి అడవుల్లో బొగ్గు అన్వేషణ కోసం డ్రిల్లింగ్ పనులు చేపట్టినా ఫారెస్ట్ అనుమతి లేకపోవడంతో పనులు నిలిచిపోవడం తెలిసిందే. కాగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం బొగ్గు అన్వేషణ కోసం డ్రిల్లింగ్ పనులు శినోమిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ అప్పగించగా ఈ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు నెల క్రితం కిషన్ రావుపల్లిలో ఒక డ్రిల్లింగ్ పాయింట్ వేయగా మరో డ్రిల్లింగ్ పాయింట్ పెద్దతూండ్ల, తాడిచర్ల మార్గమధ్య ఆరెవాగు పక్కన డ్రిల్లింగ్ పనులు గత నాలుగైదు రోజులుగా చేపడుతున్నారు. దుబ్బపేట కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద మరో డ్రిల్లింగ్ పాయింట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక్కో డ్రిల్లింగ్ పాయింట్ 700 మీటర్లు లోతులో వేయడంతో, ఒక్కొక్క పాయింట్లు ఒక్కొక్క విధంగా 450 మీటర్ల వరకు బొగ్గు నాణ్యత గుర్తింపు లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. డ్రిల్లింగ్ పాయింట్ ద్వారా సేకరించిన బొగ్గును టెస్టింగ్ అనంతరం గ్రేడింగ్ విషయం బయట పడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయని పేర్కొంటూ భవిష్యత్లో ఇదంతా కోల్ మైనింగ్ ప్రాంతమయ్యే అవకాశం ఉందన్నారు.
తాడిచెర్ల ఓసి-2 బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



