- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ముకిలన్, రాహుల్ సెబాస్టిన్, సారూబన్ అనే ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- Advertisement -



