నవతెలంగాణ – బల్మూరు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మండలంలోని కొండనాగుల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొండనాగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.
రైతులందరికీ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోలు కేంద్రాలని రైతులు తమ ధాన్యాన్ని విక్రయాలు చేసి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ మొదలైన పంటల దిగుబడులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతులను లాభసాటిగా మార్చే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన కేంద్రాల్లోనే క్రయవిక్రయాలు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నరసయ్య యాదవ్, సీఈవో రాజ వర్ధన్ రెడ్డి డైరెక్టర్లు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవసాయ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.



