Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశం కోసం పోరాటం చేయని వారు దేశభక్తులుగా కొనియాడుతున్నారు

దేశం కోసం పోరాటం చేయని వారు దేశభక్తులుగా కొనియాడుతున్నారు

- Advertisement -

నవతెలంగాణ – వేములపల్లి 
స్వాతంత్రం కోసం పోరాటం చేయని, దేశ ద్రోహం చేసిన వారు దేశభక్తులుగా కొనియాడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కొనసాగుతున్నప్రచార జాత గురువారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారిని పూలమాలలతో స్వాగతించారు. అనంతరం మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమ కాలం నుండి 100 సంవత్సరాలుగాభారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.

స్వాతంత్రం కోసం ఎంతోమంది నాయకులు ప్రాణాలర్పించారన్నారు. స్వతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారు కుట్ర కేసులు పెట్టి నిర్బంధించినప్పటికీ ఉద్యమాలకు వెనకాడ లేదన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఆర్థిక అసమానతలు తొలగించాలని, వ్యవసాయ కార్మిక, యువజన సంఘాల సమస్యల పరిష్కారానికి సిపిఐ పోరాటాలు చేస్తూనే ఉందన్నారు. భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, దున్నేవాడిదే భూమి కావాలని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆనాడు సాయిధరహితంగా పోరాటం నడిపించిన ఘనత కమ్యూనిస్టు పార్టీలదే అన్నారు.

దేశంలో కుల, మత ప్రాంత విభేదాలు సృష్టించి ప్రజాసంక్షేమం పై దృష్టి సారించడం లేదన్నారు.  కార్పొరేట్ శక్తులకు దాసోహమై  వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు మంచి ఆదరణ ఉందన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎంరాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శిలు జగన్, గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, వీరస్వామి, మండల సహాయ కార్యదర్శులు గణేష్, దేవేందర్ రెడ్డి, అధ్యక్షులు జిల్లా యాదగిరి, కేఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -