నవతెలంగాణ – జన్నారం
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలను నమోదు చేయించుకోవాలని జన్నారం మండలం పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య కోరారు. అధికారుల ఆదేశాల మేరకు గురువారం పోన్కల్ రైతులు వేదికలో పలు గ్రామాల నుంచి వచ్చిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నగదు ప్రయోజనాన్ని పొందాలంటే ప్రతి రైతు విధిగా వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. దీనికి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు తీసుకురావాలన్నారు. ఈ ఫార్మార్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ దేవుని గూడా రైతు వేదికలో, సింగరాయపేట క్లస్టర్ ఏఈఓ సాయి తిమ్మాపూర్ రైతు వేదికలో, కలమడుగు క్లస్టర్ ఏఈఓ దివ్య కలమడుగు రైతు వేదికలో, చింతగూడ క్లస్టర్ ఏఈఓ లవన్ కృష్ణ చింత గూడా రైతు వేదికలో కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహించారు.
ప్రతి రైతు వివరాలను నమోదు చేయించుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



