Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -

– కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
–  తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత 2025 ఓటరు జాబితాను సరిపోల్చుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించారా? అని పరిశీలించారు.

నిర్దిష్ట గడువు లోపు ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.   భూభారతి, గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఇంకనూ ఏవైనా అర్జీలు పెండింగ్ లో ఉంటే, వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆయా మాడ్యూల్స్ లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదాబైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, పీఓటీ భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే, అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్నచిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని, క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు.

ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదాబైనామా దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ లో రెండు రోజులలోపు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసిల్దార్ ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ, వాటిని ఏ మాడ్యుల్ లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -