నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
బేల మండల కేంద్రంలోనే డిగ్రీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. దూర భారంతో పాటు చలి, ఆకలిని తట్టుకోని విద్యార్థులు వస్తున్నారని, వెంటనే మండల కేంద్రంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. గతంలో బేల మండల కేంద్రంలో ఉన్న సెంటర్ ను ఆదిలాబాద్ కు మార్చడంతో 50 మీటర్ల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనేక ఇబ్బందులతో వస్తున్నారని ఏబీవీపీ కన్వీనర్ నిఖిల్ తెలిపారు. బేల మండలంలో 600 మంది విద్యార్థులుంటే కేవలం 477 మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ప్రస్తుతం చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉందన్నారు. సెంటర్ దూరం, ఆకలిని తట్టుకోని వస్తున్నారని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సాయి, పృథ్వీ, కిరణ్, మణిష్, బేల డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
బేలాలోనే డిగ్రీ పరీక్ష కేంద్రం కొనసాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



